![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -165 లో..... మహా, చక్రి ఇంటికి వస్తారు. మహాకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినందుకు నారాయణ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను కష్టపడి టెస్ట్ లో పాస్ అయ్యానని మహా చెప్తుంటే దానికి కారణం నేనని చెప్పట్లేదు ఏంటని చక్రి ఫీల్ అవుతాడు. కోపంగా లోపలికి వెళ్తాడు చక్రి. వాడికి ఏమైందని మాధవ అడుగుతాడు. ఆయన కష్టాన్ని గుర్తించలేదని ఫీల్ అయ్యాడని మహా అంటుంది. ఆ తర్వాత చక్రి వల్లే లైసెన్స్ వచ్చిందని జరిగిందంతా మహా చెప్తుంది. ఆ తర్వాత కోపంగా ఉన్న చక్రి దగ్గరికి మహా వెళ్లి మాట్లాడుతుంది.. కానీ నీ వల్లే వచ్చిందని మాత్రం చెప్పదు.
ఆ తర్వాత చక్రి , కేశవ మాట్లాడుకుంటుంటే అప్పుడే శైలు వస్తుంది. కేశవ వెళ్తాడు. నా కంటే వెనకాల పుట్టాడు.. వెనకాల ప్రేమించాడు వాడి లవ్ స్పీడ్ గా వెళ్తుంది.. నా లవ్ మాత్రం ఎక్కడ ఉందో అక్కడే ఉందని చక్రి అనుకుంటాడు. శైలు, కేశవ బయటకు వెళ్తారు. శైలుకి నచ్చిన ఫుడ్ తింటుంది. ఇంట్లో గొడవ అయిందని శైలు చెప్తుంది. కేశవ, శైలు వాళ్ళు అలా ఉండడం శైలు వాళ్ళ అన్న సురేష్ చూస్తాడు. మరుసటిరోజు సురేష్ తన ఫ్రెండ్స్ తో ఉంటాడు. మీ చెల్లి వాడితో లవ్ ఏంట్రా అని మాట్లాడుతారు. అప్పుడే మహా అటుగా వెళ్తుంటే.. సురేష్ తనని ఏడిపిస్తాడు. పంచమి పాప అంటాడు. అయిదుగురు మగాళ్ల మధ్యలో ఉంటుందని మాట్లాడుతాడు. మహా వచ్చి కోప్పడుతుంది. దాంతో మహా వెళ్తుంటే మహా చున్నీ లాగుతారు వాళ్ళు. మహా బురుదలో పడిపోతుంది. ఆ తర్వాత మహా ఇంటికి వెళ్తుంది. జరిగింది మొత్తం అందరికి చెప్తుంది. వాడిని చంపేస్తాను అని కేశవ అంటుంటే మహా ఆపుతుంది. ఆల్రెడీ చక్రి అన్న వెళ్ళాడని బంటి అంటాడు.
ఆ తర్వాత అందరు కలిసి సురేష్ ఇంకా తన ఫ్రెండ్స్ ని కొడుతారు. మహాకి సారీ చెప్పిస్తారు. సురేష్ ఇంటికి వెళ్లి నా చెల్లి వెంటపడొద్దు అన్నందుకు కొట్టారని అబద్ధం చెప్తాడు. దాంతో ఆ కుటుంబమంతా రౌడీలు అని వరాలు కోప్పడుతుంది. ఆ తర్వాత చక్రి ఇంకా కోపంగా ఉంటాడు. మహా వాటర్ తీసుకొని వచ్చి ఇస్తుంది. అప్పుడే నారాయణ ఇంటికి వరాలు గొడవకి వస్తుంది. తరువాయి భాగంలో నారాయణ కుటుంబాన్ని అరెస్ట్ చెయ్యమని పోలీసులతో వరాలు అంటుంది. అప్పుడే మహా ఎంట్రీ ఇచ్చి నేను కూడా వస్తానని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |